కోవిడ్ 19 ప్రారంభం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షలను డీజీసీఏ మరో నెల పొడిగించింది. ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు నవంబరు 30 వరకు యథాతథంగా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పరస్పర ఒప్పందం మేరకు మాత్రమే ఆయా దేశాల నడుమ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగుతాయని తెలిపింది. కార్గోకు ఆంక్షలు వర్తించవని డీజీసీఏ పేర్కొంది. ఎంపిక చేసిన మార్గాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని సర్వీసులు యథాతథంగా తిరుగుతాయని తెలిపారు. దేశంలో కొవిడ్ కేసుల ఉధృతి పెరిగాక గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించారు.