Namaste NRI

భారతీయ వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌… ఏడాది పాటు ఉచితంగా

శామ్‌ ఆల్ట్‌మన్‌ నేతృత్వంలోని ఓపెన్‌ ఏఐ కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది. నవంబర్‌ 4 నుంచి ప్రారంభమయ్యే పరిమిత కాల ప్రమోషనల్‌ పీరియడ్‌లో రిజిష్టర్‌ చేసుకున్న వారికి చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరంపాటు ఉచితంగా అందించబోతున్నట్టు వెల్లడించింది.  భారత్‌లో తొలిసారిగా దేవ్‌డే అనే ఈవెంట్‌ను ఓపెన్‌ ఏఐ బెంగళూరులో నిర్వహించనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఈ ఆఫర్‌ కొత్త యూజర్లకు, ఇప్పటికే చాట్‌జీపీటీ గో సబ్‌స్ర్కైబర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఏడాది ఉచిత సేవలు లభిస్తాయి.

Social Share Spread Message

Latest News