Namaste NRI

నేడే హుజూరాబాద్ ఉప ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు రంగం సిద్దమైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు ఐదు నెలలుగా హోరాహోరీగా ప్రచారం సాగింది. ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్‌ నువ్వా నేనా అన్న స్థాయిలో జనాలకు చేరవయ్యే ప్రయత్నం చేశాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు పలువురు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోట్ల మొత్తంలో పందేలు కాస్తుండటం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events