Namaste NRI

45 ది మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్

కన్నడ అగ్ర నటులు శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌ బి.శెట్టి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం 45 ది మూవీ. అర్జున్‌ జన్య దర్శకుడు. ఉమా రమేశ్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి నిర్మాతలు. కన్నడంలో రూపొందుతున్న ఈ పాన్‌ఇండియా చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది. చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకున్నది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేయనున్నారు. ప్రచారంలో భాగంగా ఈసినిమా నుంచి ఓ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. గెలుపు తలుపు దొరుకు వరకు దిగులు పడకురా అంటూ సాగే ఈ క్రేజీ సాంగ్‌ని రోల్‌ రైడా రాసి, వినాయక్‌తో కలిసి ఆలపించారు. జానీ మాస్టర్‌ నృత్య రీతుల్ని సమకూర్చారు. ఓ వైవిధ్యమైన వాతావరణంలో ఈ పాట చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తున్నది. శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌.బి శెట్టి ఈ పాటలో క్రేజీగా కనిపించారు. ఈ చిత్రానికి మాటలు: అనిల్‌కుమార్‌, కెమెరా: సత్య హెగ్డే, నిర్మాణం: సూరజ్‌ ప్రొడక్షన్స్‌, కథ, సంగీతం, దర్శకత్వం: అర్జున్‌ జన్య.

Social Share Spread Message

Latest News