డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. డ్రగ్స్ కేసును విచారించిన ముంబై హైకోర్టు ఆర్యన్ ను బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ ప్రతాలు అందడంలో జాప్యం కావడంతో ఆర్యన్ నేడు విడుదలైయ్యాడు. అక్టోబరు 3న క్రూయిజ్‌షిప్ లో రేవ్‌పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు మూడు వారాలుగా జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం అతని తరపు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు.
అక్టోబరు 28న ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆర్డర్లు జైలు అధికారులు చేరలేదు. దీంతో ఆర్యన్ ఖాన్ విడుదల ప్రక్రియ జరగలేదు. నేడు బెయిల్ ఆర్డర్ పేపర్లు అధికారులకు చేరాయి. దీంతో ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి బయటకు పంపించారు.