Namaste NRI

మంచి రోజులు వచ్చాయి… ఆ గ్యారెంటీ నేను ఇస్తున్నా

సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ కౌర్‌ జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి.  ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. యాక్షన్‌ హీరో గోపీచంద్‌, అల్లు అరవింద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాననేది సినిమా చూస్తే అర్థమవుతంది. మంచి రోజులు వచ్చాయి. పెద్ద విజయం సాధించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. అనంతరం  అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. శోభన్‌లో చాలా టాలెంట్‌ ఉంది అని తెలిపారు.  దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో ఈ సినిమా తీశాను. ఈ సినిమా సరదాగా చేసినా సీరియస్‌ విషయం ఉంది. ఈ సినిమా చూసి నవ్వుతారు. ఎంజాయ్‌ చేస్తారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. నవంబర్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events