Namaste NRI

పుష్పక విమానం ట్రైలర్ ను విడుదల చేసిన అల్లు అర్జున్

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం పుష్పక విమానం. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు  అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆనంద్‌ తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించాడు. ట్రైలర్‌లో అతను ఆకట్టుకునేలా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఈ కథలో హీరో క్యారెక్టర్‌కు చాలా కష్టాలుంటాయి. అతని కష్టాలు మనల్ని నవ్విస్తాయి. సునీల్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాకు ఓ పిల్లర్‌. గీత్‌ సైని, శాన్వి మేఘనా సూపర్‌గా నటించారు అని తెలిపారు. హీరో ఆనంద్‌  దేవరకొండ మాట్లాడుతూ పుష్పక విమానం సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు గీత్‌ సైని, శాన్వి మేఘనా, నిర్మాత విజయ్‌ మట్టపల్లి, దర్శకుడు దామోదర, నటుడు అభిజీత్‌, కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌, గీత రచయిత ఫణికుమార్‌ రాఘవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events