అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ మూడో డోస్‌ను వైట్‌హౌస్‌లో ఆమె తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అర్హులైన వారందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రారంభం నుంచి ఇదే మాట చెప్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే ఉచితం కూడా అని తెలిపారు.
మోడెర్నా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అమెరికా పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చిన సంగతి తెలిసిదే. 65 ఏళ్లు పైబడిన వారందరూ బూస్టర్ తీసుకోవాలని ఈ సంస్థ చెప్పింది. 18`65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కూడా ఉద్యోగ రీత్యా ఎక్కువ మందిని కలిసేవారు, కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. అయితే అమెరికాలో ఇప్పటికీ చాలా మంది పౌరులు వ్యాక్సిన్ తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడం గమనార్హం.