భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను గుర్తించిన ప్రభుత్వం దానిని ట్రావెలర్స్ వ్యాక్సినేషన్ స్టేటస్‌లో చేర్చింది. ఫలితంగా ఆ టీకా తీసుకున్న ప్రయాణికులను దేశంలోకి అనుమతించనుంది. భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాను గత నెలలో గుర్తించిన ఆస్ట్రేలియా తాజాగా కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దాదాపు 600 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా ఓకే చెప్పింది. దీంతో ఆ దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి మళ్లీ మొదలైంది. ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టాటస్ విషయంలో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడిరచింది.