కేరళలోని కోచికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్షీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ దుర్మరణం చెందారు. 2019లో అందాల పోటీలలో అన్సీ కబీర్, మిస్ కేరళలో విజేతగా నిలవగా అంజనా షాజన్ రన్నరప్‌గా నిలిచారు. కోచికి సమీపంలో వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అన్సు కబీర్‌ది తిరువనంతపురం కాగా, అంజనా షాజన్ కోచికి చెందినవారు. అయితే ప్రమాద సమయంలో కేవలం డ్రైవర్ మాత్రమే సీటు బెల్టు ధరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.