కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంట్ మూవీ గుడ్ లక్ సఖి. అది పినిశెట్టి లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో కీర్తి సురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా కనినిపిస్తుంది. ఆమెకు కోచ్‌గా జగపతి బాబు కనిపిస్తారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం అని దర్శక నిర్మాతలు తెలిపారు. అంతే కాకుండా ఆ పోస్టర్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు. నగేష్ కుకుమార్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నట్టు ఫిల్మ్‌మేకర్ తెలియజేశారు.