దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కొన్ని చోట్ల ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, హిమచల్ ప్రదేశ్‌లలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలుపొందింది. తృణమూల్ కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ప్రాంతీయ పార్టీలు మిగతా స్థానాల్లో గెలుపొందాయి. అంతేకాదు ఉప ఎన్నికలు జరిగిన మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా, పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/laila-1-300x160.jpg)