Namaste NRI

వాట్సాప్ నుంచి మరో అప్ డేట్

వాట్సాప్‌ యూజర్ల కోసం మరో అప్‌డేట్‌ సిద్ధమవుతోంది. అనుకోకుండానే పొరపాటునో పంపిన మెసేజ్‌ను డిలీట్‌ చేసేందుకు ప్రస్తుతం కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఆ సమయం దాటితే ఇక ఆ మెసేజ్‌ను డిలీట్‌ చేయడం సాధ్యం కాదు. అయితే ఇకపై ఆ సమయ పరిమితిని వాట్సాప్‌ ఎత్తివేస్తోంది. ఈ ఫీచర్‌ కనుక అందుబాటులోకి వస్తే గతంలో పంపిన పాత మెసేజ్‌లు, వీడియోలను కూడా డిలీట్‌ చేసుకునే వెసులుబాటు యూజర్లకు లభిస్తుంది. 2017లో డిలీట్‌ ఫర్‌ ఎవిరీవన్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టినపుడు ఏడు నిమిషాల వ్యవధి మాత్రమే ఉండేది. అంటే పంపిన మెసేజ్‌లను ఆ సమయంలోపు డిలీట్‌ చేయాల్సి వచ్చేది. 2018లో ఈ సమయాన్ని 4,096 సెక్షన్లకు అంటే గంటా 8 నిమిషాలు 16 సెకన్లకు పెంచింది. అయితే ఇప్పుడు దానిని కూడా తొలగించింది. ఎప్పుడైనా డిలీట్‌ చేసుకునే వెసులుబాటు తీసుకొస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events