Namaste NRI

మోహన్‌లాల్ వృషభ .. రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్‌ నటించిన చారిత్రాత్మక పానిండియా చిత్రం వృషభ. నందకిశోర్‌ దర్శకుడు. శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె.పద్మకుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌సింగ్‌, విశాల్‌ గుర్నాని, జుహి పరేఖ్‌ మెహతా నిర్మాతలు. ఈ నెల 25న గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్‌గా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఓ గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని, మోహన్‌లాల్‌ నటవిశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చని మేకర్స్‌ చెబుతున్నారు. సమర్జీత్‌ లంకేశ్‌, రాగిణి ద్వివేది, నయన్‌ సారిక, అజయ్‌, నేహా సక్సేనా, గరుడరామ్‌, వినయ్‌వర్మ, అలీ, అయ్యప్ప పి.శర్మ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఎస్‌.ఆర్‌.కె, జనార్దన మహర్షి, కార్తీక్‌, కెమెరా: ఆంటోనీ సామ్‌సన్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌, అరియన్‌ మెహెదీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events