భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ,మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం.

ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్, ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్డర్ ఆఫ్ ఒమన్ అనేది ఒమన్, విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం.















