అమెరికాలోని బడా కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కరోనా టీకా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జనవరి 4 కంటే ముందే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని డెడ్‌లైన్ విధించింది. అలాగే వారానికోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది. నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. డెడ్ లైన్ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయని పక్షంలో కంపెనీలకు 14 వేల డాలర్లు (రూ.10.41 లక్షలు) జరిమానా విధిస్తామని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.