Namaste NRI

టీ 20 ప్రపంచకప్ లో రికార్డు సృష్టించిన భారత్

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 బంతులు మిగి ఉండగానే భారత్‌ టార్గెన్‌ను ఫినిస్‌ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల తర్వాత తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. స్కాట్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన కోహ్లి మరో సందేహం లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. భారత మౌలర్లు పసికూన స్కాట్లాండ్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో ఆ జట్టు 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జడేజా (3/15), షమి (3/15), బుమ్రా (2/10) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. స్వల్ప ఛేదనలో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కేఎల్‌ రాహుల్‌  (6I4, 3I6) ధనాధన్‌ అర్థశతకంతో సత్తా చాటాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌  (5I4, 1I6) రాణించారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగింది.  రాహుల్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్‌ యాదవ్‌ (6 నాటౌట్‌) తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్‌ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events