Namaste NRI

ఇది నా కెరీర్‌లో మెమరబుల్‌ మూవీ : రవితేజ

రవితేజ హీరోగా రూపొందిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ భర్త మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలు. తిరుమల కిశోర్‌ దర్శకుడు. చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడారు. ఇది నా కెరీర్‌లో మెమరబుల్‌ మూవీ. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నేనైతే ఎంజాయ్‌ చేస్తూ పనిచేశాను. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది. ఇందులో కథానాయికలిద్దరూ సినిమాకు ఎక్కడలేని అందాన్ని తెచ్చారు. కిశోర్‌ తిరుమల అద్భుతమైన దర్శకుడు. ఇప్పటివరకూ ఎమోషనల్‌ కథలు తీసిన కిశోర్‌ ఈ సినిమాతో కడుపుబ్బ నవ్విస్తాడు. ఇదో అద్భుతమైన ఫన్‌ రైడ్‌. చూసి ఎంజాయ్‌ చేయండి అని అన్నారు.

దర్శకుడు తిరుమల కిశోర్‌ మాట్లాడుతూ పనిచేసే కొద్దీ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇది. ఆర్టిస్టుల మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకు హైలైట్‌. పండక్కి అద్భుతమైన కామెడీ సినిమా చూస్తారు అని చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయికలు అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు డైరెక్టర్స్‌ బాబీ, హరీశ్‌శంకర్‌, శివా నిర్వాణ, పవన్‌ బసంశెట్టి కూడా పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events