Namaste NRI

ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ సీక్వెన్స్‌తో ది రాజాసాబ్!

ప్రభాస్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ది రాజాసాబ్‌. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్దికుమార్‌ కథానాయికలుగా. మారుతి దర్శకత్వం. టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్‌ మీట్‌లో దర్శకుడు మారుతి మాట్లాడారు. తొమ్మిది నెలలకు ఓ సినిమా చేసే నేను మూడేళ్లు కష్టపడి ది రాజాసాబ్‌ చేశాను. చూసినవారంతా ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఓ కమర్షియల్‌ హీరోతో ఇలాంటి మైండ్‌గేమ్‌ సినిమా రాలేదని అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆ 40 నిమిషాల ఎపిసోడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇది కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా. ఒక్కరోజులో అందరికీ నచ్చే సినిమా కాదు. ఇలాంటి పాయింట్‌ ప్రేక్షకులకు రీచ్‌ అవ్వడానికి కాస్త టైమ్‌ పడుతుంది. ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్‌ డిజప్పాయింట్‌ అయ్యారని తెలిసింది. కథకు కనెక్ట్‌ కాకపోవడం తో ఆ సీన్స్‌ తప్పించాం. కానీ ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు ఓల్డ్‌ గెటప్‌ సీన్స్‌ యాడ్‌ చేశాం. షోస్‌ నుంచి రియల్‌ రాజాసాబ్‌గా నేను ఫీలయిన ప్రభాస్‌ని తెరపై చూస్తారు అని మారుతి చెప్పారు.

ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయికలు నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్దికుమార్‌లు ఆనందం వెలిబుచ్చారు. తొలిరోజు తమ అంచనాలకు మించి ప్రపంచవ్యాప్తంగా 112కోట్ల వసూళ్లు దక్కాయని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events