
అసభ్య కంటెంట్‌ను తొలగించకపోతే నియంత్రణ చర్యలు తప్పవన్న కేంద్రం హెచ్చరికలతో మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ఎక్స్ దిగి వచ్చింది. కంటెంట్‌ను సమన్వయ పరచడంలో తమ ప్లాట్‌ఫామ్‌లో కొన్నిలోపాలు ఉన్నాయని అంగీకరించి , 600 అశ్లీల ఖాతాలను తొలగించినట్టు ప్రకటించింది. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకొంటామని తెలిపింది. అసభ్యత కలిగిన కంటెంట్‌ను తమ వేదికలో పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని చెప్పింది. అలాంటి అసభ్యత కలిగిన 3,500 కంటెంట్ విషయాలను బ్లాక్ చేశామని తెలిపింది. అసభ్య కంటెంట్‌ను నిరోధించేలా తమ సంస్థ ప్రమాణాలను మరింత మెరుగు పరుచుకుంటున్నామని వెల్లడించింది.















