దేశంలో కరోనా మహమ్మారి వేళ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపదలో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకున్నాడు. అవసరమైన వాళ్లకు తాను కేవలం ఒక్క ట్వీట్ దూరంలో మాత్రమే ఉన్నానని ఆయన చాలా సందర్భాల్లో రుజువు చేశాడు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో ఆయన మరో మంచి పని చేశాడు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లవారి నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని ప్రజలను అభ్యర్థించాడు. ఓ తోపుడు బండిలో కూరగాయాలు అమ్ముతున్న ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్లి వారితో మాటలు కలిపాడు. వారి నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ యువకులతో సంభాషిస్తూ వీడియో కూడా తీసుకున్నాడు. తాజా కూరగాయాలను ఎలా కొనాలో ఆ వీడియోలో వివరించారు. అందరూ చిరు వ్యాపారుల నుంచి నిత్యావసరాలు కొనండి అని అభ్యర్థించాడు.