
గ్రీన్‌ల్యాండ్ స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు ర్యాండీ ఫైన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని దానిని అమెరికాలో చివరి రాష్ట్రంగా చేర్చుకోవాలన్న బిల్లును ప్రతిపాదించారు. ఈ మేరకు గ్రీన్ ల్యాండ్ స్వాధీనం, రాష్ట్ర హౌదా చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని మార్గాలను అనుసరించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం ఇచ్చే చట్టంగా తెలిపారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వాదనతో ఏకీభవించినట్టు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆర్కిటిక్ ప్రాంతాన్ని నియంత్రించకుండా మన శత్రువులను నిరోధించవచ్చు. ఇంకా రష్యా, చైనా నుంచి మన ఉత్తర ప్రాంతాన్ని రక్షించుకోవచ్చు అని తెలిపారు.















