Namaste NRI

నాగబంధం నుంచి పార్వతిగా.. నభా నటేష్‌ ఫస్ట్‌లుక్‌

నిర్మాత అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామా నాగబంధం. విరాట్‌కర్ణ కథానాయకుడు. ఈ చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్‌ పాత్రను పరిచయం చేస్తూ, ఈ సినిమాకు చెందిన ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు పార్వతి. ఇక పోస్టర్‌ని గమనిస్తే, హుందాతనం, పవిత్రత, ఆధ్యాత్మికత మేళవింపుగా ఆమె లుక్‌ ఉన్నది. దేవాలయం నేపథ్యంలో పక్షులతో ఆడుకుంటూ ఈ పోస్టర్‌లో ఆమె కనిపిస్తున్నది. చుట్టూ రంగురంగుల పూలు, పచ్చని చెట్లు, నెమళ్లు ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నది.

దేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంతో ఈ సినిమా కథ నడుస్తుందని, నాగబంధ సంప్రదాయ రహస్యాలను అన్వేషిస్తూ సాగే కథ ఇదని, డివోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. జగపతిబాబు, జయప్రకాష్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్‌ నామా, నిర్మాతలు: కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌ ఎస్‌, సంగీతం: అభే, జునైద్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అశోక్‌ కుమార్‌, ఎడిటర్‌: పవన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events