Namaste NRI

అంతరిక్షం లో మరో అద్భుతం

ఈ శతాబ్దంలోనే మరో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వబోతోంది. ఇది తూర్పు తీర దేశాల్లో కొంత సమయం పశ్చిమ తీర దేశాల్లో మరి కొంత సమయంలో కనువిందు చేస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలకు వాతావారణం అనుకూలంగా లేకపోతే తాము ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంచనాల ప్రకారం నవంబర్‌ 19వ తేదీ దాదాపు 3 గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దీన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పకుండా ఇళ్లలో నుంచి బయటికి రావాలని నాసా కోరుతోంది. అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకు చూడొచ్చని తెలిపింది.

                పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా చెబుతోంది. ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజలకు కూడా దర్శనమివ్వబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events