సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, సీనియర్ నటి వాణి విశ్వనాథ్ కుమార్తె వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 11.11. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 11.11 చిత్రం టైటిల్ ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా పనిచేస్తేనే విజయాలు వరిస్తాయి అని అన్నారు. ఈ వేడుకకి రావడానికి కారణం కోటి. ఆయనతో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదన్నారు. నా విజయాలకి కారకులు రాజ్, కోటిలే. కోటీ తనయుడు రాజీవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇద్దరు కొడుకుల్లో ఒకరిని సంగీతం వైపు మరొకరిని నటనలోనూ ప్రోత్సహిస్తున్నారు కోటి. మణిశర్మ తనయుడు సాగర్ నా సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇలా చిత్రసీమకి కొత్తం రావాలి. ఎప్పుడూ ఓ జీవనదిలా సాగిపోవాలి. రాజీవ్‌కి, ఈ చిత్రబృందానికి మంచి చేకూరాలని ఆశిస్తున్నా అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)