కార్తీకమాసం అంటే భాగ్యనగరవాసులకు మొదట గుర్తుకొచ్చేది కోటిదీపోత్సవం. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దిపోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపోత్సవం తొలిరోజు పూజలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామిజి, కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠం శ్రీ శ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేసారు. ఇదే వేదికపై బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనాన్ని వినిపించారు. దీ పోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా కాశీ స్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మలెల్ల అర్చన చేశారు. దాంతో పాటు శివ లింగాలకు భక్తులు కోటి మల్లెల అర్చనను నిర్వహించారు. వేదికపై కాళేవ్వరం శ్రీముక్తేశ్వర కల్యానం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం హంస వాహనం చేశారు. ఈ పూజలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.