పోలీసుల వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి చేసిన పోరాటమేమిటి? తనకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును అతను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానంగా దృశ్యం`2 ఉంటుందని చిత్రబృందం వెల్లడిరచింది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన దృశ్యం 2 విడుదల ఖరారైంది. విజయవంతమైన దృశ్యం కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టిజర్‌ని విడుదల చేశారు. చీకటి జ్ఞాపకాల్లోని మమ్మల్ని మళ్లీ లాగొద్దు, ఇంతకుముందు ఇలా ఎన్నో సమస్యలు వచ్చాయి, పోయాయి. ఇది కూడా పోతుంది అనే సంభాషణలు టీజర్‌లో వినిపిస్తాయి. రాంబాబు పాత్రలో వెంకటేష్ మరోసారి సందడి చేయనున్నారు. తన కుటుంబం కోసం పాటుపడే ఓ మధ్య తరగతి తండ్రిగా వెంకటేష్ కనిపిస్తారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబవూర్, సురేష్‌బాబు కలిసి నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 25 నుంచి సినిమాని చూడొచ్చని ఆ సంస్థ ప్రకటించింది.