ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ ముప్పుతో లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి బూడిదవుతున్నాయి. ఒక్కసారి అడవికి నిప్పంటుకుంటే దాన్ని ఆర్పేయడం ఎవరితరం కావడం లేదు. వేలాది వన్యప్రాణాలు అంతరించి పోతున్నాయి. దీంతో ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును ముందుగానే అంచనా వేయొచ్చంటూ బాలిక రేష్మా కోసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్ క్లైమేట్ ఫ్రైజ్‌ను దక్కించుకుంది. రేష్మా కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిరది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)