సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ది బ్లాక్ గోల్డ్. యోగేష్ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. చివరి షెడ్యూల్‌ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సమ్మర్‌లోనే సినిమా విడుదల కానుంది. మహిళాదినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రమాదకరమైన ఓ మైనింగ్ ప్రాంతం మధ్యలో ముఖంపై దుమ్ము, శరీరంపై గాయాలతో రైఫిల్‌ని పట్టుకొని ఉన్న సంయుక్తని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

కథలోని కఠిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ని మేకర్స్ డిజైన్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో మురళీశర్మ, రావురమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, అడుకాలం నరేన్, బీవీఎస్ రవి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: యోగేష్ కేఎంసీ, ప్రసాద్‌నాయుడు, కెమెరా: ఎ.వసంత్, సంగీతం: సామ్ సిఎస్















