Skip to main content

Namaste NRI

సంయుక్త ది బ్లాక్ గోల్డ్ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంయుక్త మీనన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ డ్రామా ది బ్లాక్‌ గోల్డ్‌. యోగేష్‌ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ అధినేత రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. చివరి షెడ్యూల్‌ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సమ్మర్‌లోనే సినిమా విడుదల కానుంది. మహిళాదినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ప్రమాదకరమైన ఓ మైనింగ్‌ ప్రాంతం మధ్యలో ముఖంపై దుమ్ము, శరీరంపై గాయాలతో రైఫిల్‌ని పట్టుకొని ఉన్న సంయుక్తని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

కథలోని కఠిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ని మేకర్స్‌ డిజైన్‌ చేశారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో మురళీశర్మ, రావురమేశ్‌, నాజర్‌, మనీష్‌ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్‌, అడుకాలం నరేన్‌, బీవీఎస్‌ రవి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: యోగేష్‌ కేఎంసీ, ప్రసాద్‌నాయుడు, కెమెరా: ఎ.వసంత్‌, సంగీతం: సామ్‌ సిఎస్‌

Social Share Spread Message

Latest News