విద్య, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వచ్చే వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ద్వారా పూర్తి సహకారం అందిస్తామని తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో స్థానిక కళా, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో నిరంజన్‌కు పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా రావాలనుకున్న వారు ముందుగా తెలియజేస్తే అనుమతులు, వీసా విషయాల్లో సాయం చేస్తామన్నారు. ఉత్తర అమెరికాలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 40 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కొవిడ్ సమయంలో 6 లక్షల మంది వైద్య, పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి, ఆపన్నులకు భోజన వసతి కల్పించామన్నారు. అద్దంకి సామాజిక ఆసుపత్రిలో శీతల యంత్రాలు, ఈసీజీ పరికరం, ఎక్స్‌రే యూనిట్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)