బుల్లితెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జయమ్మ పంచాయతీ. విలేజ్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీపావళి సంద్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. కలివారపు విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎస్‌ఎస్ రోహిత్ ఆలపించారు. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. కూర్పు రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం : అనుష్ కుమార్, ఈ చిత్రంలో సుమ ఓ గ్రామ పెద్దగా కనిపించనున్నారు. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)