ఇంగ్లండ్ వెళ్లాలనుకునే భారతీయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతదేశ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను గుర్తించింది. ఫలితంగా ఈ టీకా తీసుకున్న వారు ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్రిటన్ వెళ్లి రావొచ్చు. తాము అధికారికంగా గుర్తించిన టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ను కూడా చేర్చినట్టు తాజాగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ తాజా నిర్ణయంతో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ప్రయాణానికి ముందు కరోనా నిర్ధారణ పీసీఆర్ టెస్టు చేయించుకోకుండానే ఫ్లైట్ ఎక్కేయొచ్చు. అయితే బ్రిటన్ చేరుకున్నాక మాత్రం రెండు రోజుల్లోపు పీసీఆర్/ లాటరల్ ఫ్లో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూల్) మంజూరు చేసిన టీకాలన్నింటికీ తాము గుర్తింపునిచ్చినట్టు బ్రిటన్ రవాణాశాఖ తెలిపింది. ఫలితంగా కొవాగ్జిన్, సినోవాక్, సినోఫార్మ్‌కు అనుమతి లభించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)