ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అండగా నిలిచింది. రెండు రోజుల పాటు సహాయ కార్యక్రమాలు చేపడుతామని సౌత్‌ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 900 కుటుంబాలకు అభిస్తి వెల్ఫేర్ సొసైటీ సహాయంతో పాలు, బ్రెడ్, బిస్కట్స్, పాలపొడి, ఎనర్జీ బార్ అందించారు.