విధార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ఎంతోమంది దర్శకుల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కించా అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ మన కళ్ల ముందు ఏదైనా సంఘటన జరిగినా ఎలాంటి స్పందన లేకుండా, మనం మన కుటుంబం బాగుంటే చాలని చూస్తూ వెళ్లిపోతున్నాం. సాంకేతికత వల్ల ప్రతీ విషయానికీ ఆన్‌లైన్‌లో స్పందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తుకి ఎంతో ప్రమాదం. మనమంతా మనుషులం, స్పందించాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్, దర్శకులు రమణారావు, చంద్ర మహేష్, నటుడు బెనర్జీ బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ, సందీప్, తుమ్మల చంద్ర, కళ్యాణ్ సుంకర, వీర కనక మేడల తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర యూనిట్‌తో కలసి బిగ్ టికెట్‌ను, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నెల 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)