అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ దేశంలో అగ్ర ధనికుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని అధిగమించి ఆసియా కుబేర కిరీటాన్ని కూడా దక్కించున్నారు. ముకేష్ అంబానీ సంపదను గౌతమీ అదానీ దాటేశారు. కంపెనీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ముకేష్ అంబానీని గౌతమ్ అదానీ అధిగమించారని రిపోర్టులు పేర్కొన్నాయి. అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల స్టాక్స్ భారీగా లాభపడడం ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా దిగజరడం అదానీ సంపద వృద్ధికి దోహదపడిరది.
సౌదీ కంపెనీ ఆరామ్‌కో, రిల్ ఒప్పందంపై పున సమీక్ష జరుగుతుందనే ప్రకటనల నేపథ్యంలో రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. గత 5 సెషన్లలో దాదాపు 6 శాతం మేర క్షీణించాయి. ఇదే సమయంలో అదానీ గ్రూపునకు చెందిన షేర్లు పుంజు కోవడం అదానీకి కలిసొచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.94 శాతం, అదానీ పోర్ట్స్ 4.87 శాతం మేర లాభపడ్డాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 0.50 శాతం, అదానీ పవర్ 0.33 శాతం స్వల్పంగా పెరిగాయి. కాగా అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 1 శాతం చొప4న పతనమైన విషయం తెలసిందే.