Namaste NRI

దర్శకుడు సాయి కిరణ్ చేతులు మీదుగా గాసిప్ ట్రైలర్ లాంచ్

సోషల్‌ సెటైర్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం గాసిప్‌. రాశీసింగ్‌ ప్రధాన పాత్రధారి. వైభవ్‌ కౌండిన్య దర్శకుడు. వైభవ్‌ సినీ స్టూడియోస్‌ పతాకంపై యతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్నది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు సాయికిరణ్‌ అడివి ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. గాసిప్‌ అనేది సమాజంలో సర్వసాధారణమేకానీ, ఒక్కోసారి మనం సరదాగా మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ సినిమా అని దర్శకుడు వైభవ్‌ కౌండిన్య చెప్పారు.

ఇది తాను నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో బాధ్యతగా నటించానని కథానాయిక రాశీసింగ్‌ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News