సోషల్ సెటైర్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం గాసిప్. రాశీసింగ్ ప్రధాన పాత్రధారి. వైభవ్ కౌండిన్య దర్శకుడు. వైభవ్ సినీ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్నది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు సాయికిరణ్ అడివి ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. గాసిప్ అనేది సమాజంలో సర్వసాధారణమేకానీ, ఒక్కోసారి మనం సరదాగా మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ సినిమా అని దర్శకుడు వైభవ్ కౌండిన్య చెప్పారు.

ఇది తాను నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో బాధ్యతగా నటించానని కథానాయిక రాశీసింగ్ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.





























