Namaste NRI

త్వరలోనే రిలీజ్ కానున్న ఓ అందాల రాక్షసి

షెరాజ్‌ మెహదీ స్వీయదర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ఓ అందాల రాక్షసి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. విహాన్షి హెగ్డే, కృతి వర్మ కథానాయికలు. సురేందర్‌ కౌర్‌ నిర్మాత. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో షెరాజ్‌ మెహదీ మాట్లాడుతూ ఇది మంచి కంటెంట్‌ ఉన్న సినిమా. ఓ విధంగా ఇది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ అనొచ్చు. అమాయక స్త్రీలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారో ఇందులో చూపించాం. మోసం చేసిన వారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్‌, తమ్మారెడ్డి భరద్వాజ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమా అందరికీ నచ్చుతుంది  అని తెలిపారు. ఇంకా హీరోయిన్లు విహాన్షి హెగ్డే, కృతివర్మ, రచయిత భాష్యశ్రీ కూడా మాట్లాడారు. నేహా దేశ్‌పాండే, అనంత్‌బాబు, ప్రియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కావేటి ప్రవీణ్‌. నిర్మాణం: స్కై ఈజ్‌ ది లిమిటెడ్‌.

Social Share Spread Message

Latest News