Namaste NRI

నా కెరీర్‌లో బెంచ్‌ మార్క్‌ చిత్రం

తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్‌. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం. నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా సక్సెస్‌ నేపథ్యంలో హీరో తేజ సజ్జా విలేకరులతో మాట్లాడుతూ  ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్‌ షో చూశాను. అన్ని చోట్ల నుంచీ ఎక్స్‌ట్రార్డినరీ రెస్సాన్స్‌ వస్తోంది. నేనెవరో తెలియని ఇతర భాషల ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. చిరంజీవి గారు కంగ్రాట్స్‌ మై బాయ్‌. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని మెసేజ్‌ పెట్టారు. విజయాన్ని ఆస్వాదిస్తూనే ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, ముంబయి వెళ్తున్నాం. యూఎస్‌ వెళ్లే ఆలోచన కూడా ఉంది. హనుమాన్‌  నా కెరీర్‌లో బెంచ్‌ మార్క్‌ చిత్రంగా నిలిచిపోతుంది.

ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరికీ కృతజ్ఞతలు. ఏదో దైవశక్తి మమ్మల్ని నడుపుతోందని బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా నాలుగు వారాలకుపైగా ఆడే చిత్రమని ముందే నమ్మాం. అందుకే సినిమా విడుదలకు 10 రోజుల ముందు అసలు ఒత్తిడి తీసుకోలేదు. నిర్మాత నిరంజన్‌రెడ్డి గారు మాపై చాలా నమ్మకం ఉంచారు. నటుడిగా లొకేషన్‌లో నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మొహమాటం లేకుండా చెప్తాను. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గారు ఇన్‌పుట్‌ ఎవరు చెప్పినా వింటారు.

ఈ సినిమాలో యాక్షన్‌ స్టంట్స్‌ అన్నీ ఒరిజినల్‌గా చేసినవే. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌, ైక్లెమాక్స్‌లో గాల్లో ఉండే సీక్వెన్స్‌ ఇవన్నీ రియల్‌గా చేశాం. ఎయిర్‌ సీక్వెన్స్‌లో పొద్దున మేకప్‌ వేసుకొని రోప్‌ ఎక్కితే సాయంత్రానికే దిగేవాణ్ని. హనుమ విగ్రహంతో చేసిన షాట్‌కు ఆర్నెల్ల సమయం పట్టింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గారు గ్రేట్‌ యాక్టర్‌. పెద్ద నటితో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకునే అవకాశం దక్కింది. హనుమాన్‌ జర్నీలో ఓపికగా ఉండటం నేర్చుకున్నాను. నా కొత్త సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభించబోతున్నాం. వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events