Namaste NRI

అమెరికా వెళ్తున్న భారతీయులకు.. పెద్ద షాక్‌

ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి ఆ దేశం పెద్ద షాక్‌ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా ఫీజులను భారీగా పెంచుతున్న ట్టు ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్‌ సర్కారు స్పష్టం చేసింది. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్‌-1బీ వీసా అప్లికేషన్‌ ఫీజును ఏప్రిల్‌ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతు న్నట్టు అమెరికా వెల్లడించింది. అమెరికన్‌ బహుళజాతి కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే ఎల్‌-1 వీసా ఫీజును 460 నుంచి 1,385 డాలర్లకు, విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ-5 వీసా ఫీజును 3,675 నుంచి 11,160 డాలర్లకు పెంచుతున్నట్టు ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచుతున్నట్టు బైడెన్‌ సర్కారు ప్రకటించిన ప్పటికీ అది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

అమెరికన్‌ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగు లకు హెచ్‌-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్‌ కంపెనీలు భారత్‌, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్‌-1బీ వీసాలపైనే ఆధారపడతాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events