Skip to main content

Namaste NRI

హ్యూస్టన్‌ లో ఘనంగా టీసీఏ స్వర్ణోత్సవ ఉగాది ఉత్సవాలు

మన తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) గోల్డెన్ జూబిలీ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ హ్యూస్టన్‌లో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాయకులు అనిరుధ్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండ తమ అతిథులను గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. ఉగాది పచ్చడి, శ్రీరామనవమి ప్రత్యేకమైన బెల్లం పానకం, రుచికరమైన విందు భోజనం అతిథులందరికీ మధురానుభూతిని అందించాయి. సమాజ శ్రేయస్సు కోరే పెద్దలను, భావి తరాలకు భాషను నేర్పుతున్న తెలుగు బడి ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలతో సత్కరించారు. రచయిత చిట్టెన్ రాజు, రవి తామిరిస, రాజశేఖర్ యలమంచిలి, రత్న పాప, దీప్తి పెండ్యాల, కల్యాణ్ చివుకుల, రాజశేఖర్ చప్పిడి ఈ వేడుకకు విచ్చేసి తమ సందేశాలను అందించారు.

ఆగస్టు 7, 8 తేదీల్లో జరగనున్న టీసీఏ స్వర్ణోత్సవ సంబరాల కోసం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీల పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత అధ్యక్షురాలు యాదిగిరి రెడ్డి నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు ఆహూతులు అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకకు స్థానిక తెలుగువారు భారీగా తరలివచ్చారు.

Social Share Spread Message

Latest News