మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సినిమా గేమ్‌ఛేంజర్. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా నిర్మాణంలోనే ఉండటం అభిమానుల్లో అసహనానికి దారితీస్తూ వుంది. అయితే ఎట్టకేలకు చరణ్ గేమ్‌ఛేంజర్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఇటీవలే బెంగళూరులో 15రోజుల పాటు జరిగిన షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తయిందని నిర్మాత దిల్ రాజు తెలియజేశారు. మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం సమకాలీన రాజకీయ ముఖచిత్రానికి అద్దం పట్టేలా ఉంటుందని తెలుస్తున్నది. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలు. ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.