Namaste NRI

తొలి సీఈసీ సుకుమార్‌ సేన్‌పై బయోపిక్‌

భార‌త తొలి ఎన్నిక‌ల సంఘం క‌మీష‌న‌ర్ సుకుమార్ సేన్  జీవిత‌క‌థ ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కించ‌ను న్నారు. రాయ్ క‌పూర్ ఫిల్మ్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించ‌నున్న‌ది. సుకుమార్ సేన్ జీవితంపై చిత్రాన్ని తీసే హ‌క్కుల‌ను తాము సొంతం చేసుకున్న‌ట్లు ట్రిక్‌టేన్మెంట్ మీడియా ప్ర‌క‌టించింది. 18వ సాధార‌ణ‌ ఎన్నిక‌ల కౌంటింగ్ రేపు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించడం విశేషం. 1951-52లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో భార‌త సీఈసీగా సుకుమార్ సేన్ చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎలా ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించా ర‌న్న కోణంలో చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. మ్యాథ‌మెటీషియ‌న్‌, సివిల్ స‌ర్వెంట్ అయిన సేన్‌, ప్ర‌జాస్వా మ్య రీతిలో తొలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. 17 కోట్ల మంది ఓట‌ర్లు ఆ ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. సుకుమార్ సేన్ జాతీయ హీరో అని, అసాధార‌ణ‌మైన అత‌ని జీవితాన్ని తెర‌కెక్కించ‌డం గౌర‌వంగా ఫీల‌వుతున్న‌ట్లు సిద్దార్థ రాయ్ క‌పూర్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events