బాంబు సైక్లోన్ పిలిచే మంచు తుఫాను ధాటికి అమెరికా వణికిపోతున్నది. రహదారులపై మంచు దిబ్బల్లా పేరుకుపోయింది. మరోవైపు అమెరికాలో పది రాష్ర్టాల్లో బైడెన్ ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. వీటిలో న్యూయార్క్, మిషిగాన్, మిన్నెసోటా, మాంటెన్నా, ఐయోవా, ఇండియానా, విస్కిన్సన్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, ఐయోవా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికాలో ఇప్పటికే 60 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ భయంకరమైన మంచు తుఫాను మరో వారం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీల వరకు పడిపోయాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు భయానకంగా ఉన్నాయి.