Skip to main content

Namaste NRI

గజ మూవీ నుంచి అల్లకల్లోలంగా.. ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్ విడుదల

సతీశ్‌ జై స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం గజ. ఫర్నాజ్‌ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందరభంగా ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సాయిరాజేష్‌ అల్లకల్లోకంగా అంటూ సాగే ఈపాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు వెన్నెముక.

వాణిజ్య అంశాలతో పాటు అద్భుతమైన సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఇదొక భావోద్వేగ ప్రయాణం. ైక్లెమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది. నా భార్య మైత్రీ శరణ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించింది. అందరూ చూసి సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నా అని హీరో, నిర్మాత, దర్శకుడు సతీశ్‌ జై అన్నారు. ఈ సినిమా కోసం సతీశ్‌ జై ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నాడని, దానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా ఇస్తుందని సంగీత దర్శకుడు మణిశర్మ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మైత్రీ శరణ్‌, కథానాయిక ఫర్నాజ్‌ శెట్టి, సెవెన్‌ హిల్స్‌ సతీశ్‌, గీత రచయిత మిట్టపల్లి సురేందర్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events