టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో కానీ అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.