Skip to main content

Namaste NRI

దీపావళి కానుకగా కాకా నుంచి.. చిరంజీవి పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల

చిరంజీవి కాకా చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సత్యం, కదిరి కాళిదాస్‌గా రెండు భిన్న పార్శాలున్న పాత్రలో కనిపించారు చిరంజీవి. ఓ మధ్యతరగతి వ్యక్తి జీవిత ప్రయాణం, అతని తాలూకు ఓ రహస్యమైన గతం, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

దీపావళి సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పచ్చని పొలాల మధ్య కొడవలి పట్టుకొని ఆగ్రహంగా కనిపిస్తున్నారు చిరంజీవి. కుటుంబ శ్రేయస్సు కోసం కాకా చేసే పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తమని, చిరంజీవి పాత్ర ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. అనస్వరరాజన్‌, నివేదా థామస్‌, అనురాగ్‌ కశ్యప్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, నిర్మాత: వెంకట్‌ కె నారాయణ, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events