Namaste NRI

కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌… కానీ దాడి!

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నిందనే నిఘా సమాచారం అమెరికాకు కొన్ని వారాల క్రితమే వచ్చింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ట్రంప్‌ నకు ముప్పు పొంచివున్నదని సీక్రెట్‌ సర్వీస్‌ వెల్లడించిందని ఓ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. అయితే దీనిపై స్పందించేందుకు వైట్‌హౌస్‌ నిరాకరించింది. గత వారం ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్వదేశీ, విదేశీ సహచరులు లేరని పేర్కొన్నది.

ట్రంప్‌ హత్యకు కుట్ర పన్నినట్టు వస్తున్న ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. ట్రంప్‌పై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ ప్రతినిధి నస్సీర్‌ కనాని తెలిపారు. జనరల్‌ సులేమాని హత్యలో పాత్రకు సంబంధించి ట్రంప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events