Skip to main content

Namaste NRI

అందరి అంచనాలను మించి గేమ్‌చేంజర్‌  : రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్‌చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం.  దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని లక్నోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడారు. శంకర్‌గారితో పనిచేయడం నిజంగా అదృష్టం. మా కోసం లక్నో వరకూ వచ్చిన అభిమానులకు థ్యాంక్స్‌. అందరి అంచనాలను మించి గేమ్‌చేంజర్‌ ఉంటుంది అని అన్నారు.

మా సంస్థ నుంచి వస్తున్న 50వ చిత్రం ఇది. శంకర్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్‌. దానికితోడు రామ్‌ చరణ్‌ కూడా తోడవ్వడం మరింత ఆనందంగా ఉంది అని దిల్‌రాజు చెప్పారు. ఇంకా కియారా అద్వానీ, అంజలి, ఎస్‌.జె.సూర్య కూడా మాట్లాడారు. ఇదిలావుంటే శనివారం విడుదలైన టీజర్‌ అభిమానుల్ని అలరిం చేలా ఉంది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందినట్టు టీజర్‌ చెబుతున్నది. ఐయామ్‌ అన్‌ప్రెడిక్టబుల్‌ అంటూ రామ్‌చరణ్‌ స్టైలిష్ గా చెప్పిన డైలాగ్‌తో ఈ టీజర్‌ ముగిసింది. రామ్‌చరణ్‌ నటనతో పాటు సంభాషణలు, సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. జనవరి 10న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News